Thursday, December 26, 2024

రికార్డు కలెక్షన్స్.. ఏకైక హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించిన ‘స్త్రీ2’

- Advertisement -
- Advertisement -

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ 2 చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ బడా హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు కలెక్షన్స్ రాబట్టి అందిరికీ షాకిచ్చింది. విడుదైలన దగ్గర నుంచి స్త్రీ2 మూవ సంచలన వసూళ్లు రాబడుతోంది. దీంతో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.థియేటర్లలో విడుదలైన ఐదవ వారంలో(34 రోజుల తర్వాత) కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఆగలేదు.

ఇప్పటికీ ప్రతి రోజు రూ.2 కోట్లు వసూల్ చేస్తోందని ట్రేడ్ అనలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తాజా పోస్ట్ చేశారు. దంతో ఇప్పటివరకు రూ.586 కోట్ల రికార్డు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిపారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ తన హిందీ వెర్షన్ కలెక్షన్స్ ఈ చిత్రం అధిగమించింది. దీంతో స్త్రీ2 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.

హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైంది.మొదటి రోజే ఈ సినిమా రూ.51.8 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారాంతంలో దాదాపు రూ.300 కోట్లు సాధించింది. మరో మూడు నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.600 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.దాంతో ఈ ఘనత సాధించిన ఏకైక బాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్రను రానుంది స్త్రీ2.

ఇందులో శ్రద్ధా, రాజ్‌కుమార్‌తో పాటు ఇందులో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన స్త్రీ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News