Monday, December 23, 2024

మన స్త్రీ నిధి సంస్థ దేశానికే ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Stree Nidhi is ideal for the country: Minister Errabelli

హైదరాబాద్: మన స్త్రీ నిధి సంస్థ దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లోని స్త్రీనిధి రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. పిజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో స్త్రీనిధి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలిచ్చిన సంస్థ స్త్రీనిధి అని ఎర్రబెల్లి అన్నారు. బ్యాంకుల కంటే కూడా స్త్రీనిధి అధిక రుణాలు ఇస్తోందన్నారు. పదేళ్ల క్రితం రూ. 32 కోట్లతో మొదలై రూ.5,300 కోట్లకు చేరామని మంత్రి తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలనకు స్త్రీనిధి సంస్థ కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News