Tuesday, April 1, 2025

జవహర్ నగర్ లో దారుణం.. రెండేళ్ల బాలుడిని పీక్కుతిన్న వీధికుక్కలు

- Advertisement -
- Advertisement -

జిహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల దాడిలో మరో బాలుడు బలియ్యాడు. మంగళవారం సాయంత్రం రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేసి పీక్కుతిన్నాయి. ఈ దారుణ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబంతోపాటు కాలనీలో విషాదం నెలకొంది.

కాగా..జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొద్ది నెలలుగా వీధి కుక్కలు సైర విహారం చేస్తున్నాయని… అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వీధికుక్కలు రెచ్చిపోతున్నాయని మండిపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News