Thursday, January 23, 2025

బాలికపై వీధి కుక్కలు దాడి

- Advertisement -
- Advertisement -

 

కొంపల్లిలో పురపాలక సంఘం పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తనుశ్రీ తీవ్రంగా గాయపడింది. దీంతో చిన్నారిని కుటుంబ సభ్యులు  హైదరాబాద్ నాంపల్లి లోని నీలోఫర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ నెల జనవరి 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News