Thursday, December 26, 2024

దోసలో క్రియేటివిటీ.. స్ట్రీట్ చెఫ్‌కు నెటిజన్లు ఫిదా (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: భారతీయుల సృజనాత్మక శక్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. రాకెట్ సైన్స్ నుంచి సాఫ్ట్‌వేర్ దాకా, వైద్య వృత్తి నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా భారతీయుల క్రియేటివిటీ కీర్తి విస్తరిస్తోంది. తాజాగా.. ఒక స్ట్రీట్ వెండర్ దోస వేయడంలో చూపిన కళాత్మకతకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దోసకు మిక్కీ మౌస్ రూపాన్ని ఇచ్చిన ఆ వంటమాస్టారుకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.

నాంది ఇండియా అనే ఎన్‌జిఓ సిఇఓ మనోజ్ కుమార్ ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ తమ అద్భుత సృజనాత్మకతతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారని, వీరితో కలసి పనిచేయడం ద్వారా పౌష్టికాహార వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాసుకొచ్చారు. ఈ స్ట్రీట్ చెఫ్ ఆర్టిస్టిక్ స్కిల్స్‌ను అందరూ ప్రశంసించాలని ఆయన కోరారు. 4 లక్షల మందికి పైగా ఇప్పటికే వీక్షించిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News