Saturday, November 23, 2024

చేతివృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అన్ని రకాలుగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వృత్తి కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నపశుసంవర్ధక సంస్థలకు చెందిన పలువురు చైర్మన్లు అభిప్రాయపడ్డారు. శనివారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, టెక్స్టైల్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గూడూరి ప్రవీణ్ నేత, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన చేతివృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సహాయ సహకారాల ఫలితంగా రాష్ట్రంలో లక్షలాదిమంది చేతివృత్తుల ప్రజలు లబ్ధి పొందుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు సరైన రీతిలో అందే విధంగా వృత్తి కులాలకు చెందిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోవెనకబడిన తరగతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, వాటి ఫలితంగా అనుభవంలోకి వస్తున్న ఫలితాలను ప్రజలకు చేరవేంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

గతంలో ఎన్నడూ లేని రీతిలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన తరగతుల అభ్యున్నతికి అందులో ముఖ్యంగా చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా రాష్ట్రంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు కృషి చేయవలసిన అవసరాన్ని గుర్తించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతులతో పాటుగా అందులో భాగమైన అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్న కృషిని, అమలుపరుస్తున్న పథకాలని ఇంటింటికి చేరవేసేందుకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలతో పాటుగా దళిత, మైనారిటీ, గిరిజన, ఆదివాసి, మహిళ, వికలాంగుల అభ్యున్నతి కోసం గడచిన తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్న కృషిని, అమలుపరుస్తున్న పథకాలను, వాటికి సంబంధించ ప్రజల అనుభవంలోకి వచ్చిన అనుభవాలను ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించేందుకు నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించడం కోసం ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, ఇతర నామినేటెడ్ సంస్థల చైర్మన్ అందరితో ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించు కోవాలని యోచిస్తున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News