Wednesday, January 22, 2025

ధ్యానంతో ఒత్తిడి నియంత్రణ : శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సానుకూల ఆలోచనలు, ఒత్తిడి నియంత్రణకు ధ్యానంతో క్రీడాకారులు వ్యక్తిగత, వృత్తిపరమైన మెరుగైన పనితీరును కనబరిచే వీలుందని రాష్ట్ర క్రీడా,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్- స్పోర్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 26న గచ్చిబౌలిలో జరిగే క్రీడోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్, స్పోర్ట్ ప్రచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్పోర్ట్ కాంక్లేవ్‌లో భాగంగా ఈ నెల 15 నుంచి 22 వరకు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అకాడమీలు, పాఠశాలల్లో ’బాడీ, మైండ్ – ఫిట్ అండ్ ఫైండ్’ పేరిట క్రీడాకారులు తమ మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు ప్రోత్సాహించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ డైరెక్టర్ కులదీప్ దీదీ, స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ, వసంత, వంశీధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News