- Advertisement -
వ్యవసాయశాఖ మంత్రి పేరుతో వాట్సప్ సందేశాలు పంపుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. నకిలీ నెంబర్లు ,డిపిలతో మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. 9353849489 నంబర్ నుంచి ఇటువంటి సందేశాలు వస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరూ ఇటు వంటి సందేశాలకు స్పందించవద్దని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నెంబర్‌కు డబ్బులు పంపించ వద్దని హెచ్చరించారు. సెబర్ నేరగాళ్లపైన చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి నిరంజన్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -