Monday, December 23, 2024

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

 

 

నిర్మల్ అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ డిస్పోజన్లో మద్యం సేవించి వాహనం నడిపిన 61 కేసులపై నిర్మల్ పట్టణ ప్రత్యేక రెండవ తరగతి మెజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. ఇందులో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష మిగతా 60 మందికి 1,02,000/ జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదం జరిగి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కావున మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News