Monday, December 23, 2024

ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Strict action against in food adulteration: Minister Harish

అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు
ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతాం
వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి
పనితీరు మెరుగుపడాలి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోము
ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఆహార భద్రత విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి
ఫుడ్ అడల్ట్రేషన్ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి
040- 21111111 టోల్ ఫ్రీ, ట్విట్టర్ హ్యాండిల్ ను ప్రజలకు చేరువ చేయాలి

హైదరాబాద్: ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం, ల్యాబ్స్ పనితీరు, సాధించిన పురోగతిపై వెంగళ్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడని ఆదేశించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి, అగ్రస్థానం చేరాలన్నారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలి, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలి. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. ఒక వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయన్నారు. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించి, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్ కి కాల్ చేసి లేదా, @AFCGHMC ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పిర్యాదులు రాగానే అధికారులు వెళ్లి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎక్కువగా నష్టం కల్గించే కల్తీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని మొబైల్ వాహనాలు పని చేయాలి. టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, ఐపిఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివ లీల, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News