Sunday, November 24, 2024

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు…

- Advertisement -
- Advertisement -

Strict action against on Drunk and Drive

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మైనర్లను అనుమతించవద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్, బార్ యజమానులకు సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపిఎస్ లు హెచ్చరించారు. సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్లు, పబ్ ల యజమాన్యంతో సైబారాబాద్ పోలీసులు సమీక్ష సమావేశo ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓమిక్రాన్‌ భయంతో పబ్‌లు, బార్లు యజమానులు ఆరోగ్య శాఖ విధించిన షరతులను ఉల్లంఘించరాదని హెచ్చరించారు. ఆంక్షల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని, వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News