Sunday, December 22, 2024

నిందితులెవరైనా కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో మంత్రి బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి రుజువైందన్నారు. ఈ కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని, ప్రభుత్వం నుండి పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. తన కుటుంబాన్ని బ్లేమ్ చేసేందుకు కొన్ని శక్తులు కు ట్రలు పన్నుతున్నాయని అన్నారు. ముఖ్యంగా అమ్నేషియా పబ్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో తన మనవడిపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.

ఈ కేసులో నిందితులు పొలిటికల్ లీడర్ల కొడుకులు కావడంతో మరింత చర్చనీయాంశంగా మారిందని, అయినప్పటికీ ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు అని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారని, ఇతర రాష్ట్రాలకు మన పోలీసులకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత వహించాలని సూచించారు.టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో పరివర్తనలో మార్పు వచ్చిందని, పేరెంట్స్ తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరుగుతుందని, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి తొలగింపు తన పరిధిలోకి రాదని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News