Sunday, January 19, 2025

నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జూలై 1న జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండ్‌లు, ఇతర సంబంధిత అధికారులకు పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, సీపీ సుబ్బారాయుడు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1న నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షల కొరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహించనున్న పరీక్షల కొరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లాలో 54,019 మంది అభ్యర్థుల కొరకు 154 పరీక్షా కేంద్రాలను గుర్తించి సిబ్బంది కూడా నియమించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, శిక్షన సంయుక్త, సహాయ కలెక్టర్లు నవీన్ నికోలస్, లెనిన్ వత్సల్ టోప్పో, హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్, టీఎస్పీఎస్సీ అబ్జర్వర్ ఆసియాఖాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News