Sunday, December 22, 2024

పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

సదాశివపేట: పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకొని లైసెన్స్‌లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహరావు అన్నారు.శుక్రవారం సదాశివపేటలోని పురుగు మందులు, పత్తి విత్తనాల దుకాణాలను, పత్తి విత్తనాల నిల్వలను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవన్నారు. పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్మితే ఊరుకోమని, శాఖ పరమైన చర్యలుంటాయన్నారు. విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. టాస్క్‌ఫోర్స్ ఎడిఎ శ్రీనివాస్ ప్రసాద్, వ్యవసాయ అధికారి అనిత, ఎస్‌ఐ గోపాల్ తది తరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News