Thursday, January 23, 2025

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట : ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్ ,బిల్ బుక్కులతో పాటు తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీడ్స్ , ఫర్టిలైజర్ దుకాణాదారులు నకిలీ విత్తనాలు ,పురుగుల మందు అమ్మవద్దని అమ్మినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులను ఎలాంటి విషయంలో మోసం చేసిన యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని రైతులు కూడా ఆప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారుల సలహాసూచనల ప్రకారం విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేశాక తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అలాగే గ్రామాలలో విడి విత్తనాలు, నకిలి విత్తనాలు ఉన్నట్లు కానీ అమ్మినట్లు కానీ తెలిస్తే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలన్నారు. వీరితో పాటు అక్కన్నపేట వ్యవసాయ విస్తరణ అధికారి సభిహ , పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో.. ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠీన చర్యలు తప్పవని సీఐ ప్రవీణ్ రాజ్ ,దుకాణదారులను హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ అధికారి సంతోష్‌తో కలిసి సీఐ ప్రవీణ్‌రాజ్ పలు దుకాణాలు ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఎరువుల ,విత్తనాలు విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
వర్గల్‌లో..మండలంలోని మజీద్ పల్లి, నెంటూరు గ్రామాలలో విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి శేష శయన , బేగం పేట పీఎస్, ఎస్‌ఐ అనిల్ తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠీన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో పోలీసులు అనిల్, స్వాతి, ఎఈఓ స్వర్ణ క్రాంతి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News