- Advertisement -
రాష్ట్రాలకు కేంద్ర హోమ్ కార్యదర్శి సూచన
న్యూఢిల్లీ : కొవిడ్ 19 వ్యాక్సిన్ల సమర్థతపై ఎవరైనా వదంతులు పుట్టిస్తే వారిని కనుగొని చట్టపరమైన చర్య తీసుకోవాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఛీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోమ్ కార్యదర్శి అజయ్‌భల్లా సూచించారు. వ్యాక్సిన్ పంపిణీలో నిపుణుల సూచనల ప్రకారం హెల్త్‌కేర్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. తరువాత రెండు, మూడు గ్రూపుల వారికి ప్రాథాన్యం ఇస్తామని తెలిపారు. వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం చేసే వారిని అరికట్టడానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అలాంటి వారిపై ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ చట్టం 2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.
- Advertisement -