Monday, December 23, 2024

ఓటరు ఆధార్ వివరాలు లీకైతే కఠిన చర్యలు : ఇసి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Strict action if voter-Aadhaar details leaked: EC warns

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడానికి ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఓటర్లు తమ ఆధార్ వివరాలను జాబితా ఫారాల్లో నమోదు చేసినప్పుడు అవి బయటకు వెల్లడైతే కఠిన చర్యలు తప్పవని ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఆధార్ వివరాలను సమర్పించ వచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు సోమవారం లేఖలు పంపింది. జాబితా లోని ఫారం 6 బి కింద ఓటర్లు తమ ఆధార్ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేయడానికి వెనుకాడితే క్లస్టర్ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడమౌతుందని, అలాగే స్పెషల్ సమ్మర్ రివిజన్ కింద కూడా శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. న్యాయమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా ఫారం 6 బి ప్రవేశ పెట్టారు. ఓటర్లు ఈ ఫారంలో తమ ఆధార్ వివరాలు నమోదు చేయవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23 లోని సబ్ సెక్షన్ (5) ప్రకారం నిర్ధారించిన అధికారాల మేరకు ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లయితే నమోదు అయి ఉన్నాయో వారంతా 2023 ఏప్రిల్ 1 నాటికి లేదా అంతకన్నాముందు తమ పేర్లతో ఆధార్ నెంబర్ జత చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో తప్పనిసరి కాదని స్వచ్ఛందమని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News