- Advertisement -
మన తెలంగాణ/ధరూర్: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధరూర్ ఎస్‌ఐ వి.రవి సూచించారు. గురువారం ధరూర్ మండల పరిధిలోని నీళహలి, నెట్టెంపాడు, గూడెందొడ్డి తదితర గ్రామాలలోని మిరప, పత్తి, కంది చేనుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చేనుల్లో అంతర పంటగా గంజాయి మొక్కలను సాగు చేయొద్దని, సాగు చేస్తే ఎన్‌డిపిఎస్ యాక్టు కింది కేసులు నమోదు చేస్తామని రైతులను హెచ్చరించారు. వ్యవసాయ భూములు, ఇండ్లలో ఎవరైనా గంజాయి పంటను సాగు చేస్తే టోల్‌ప్రీనంబర్ 100 నంబర్‌కు పోన్ చేయాలని రైతులకు సూచించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐతో పాటు ఏఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్, కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -