- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలో 180 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని సిపి అంజనీకుమార్ తెలిపారు. ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను అంజనీ కుమార్ పరిశీలించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని, లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 65 పైగా వాహనాలను సీజ్ చేశామని వివరించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించారు. ఎమర్జెన్నీ, మెడికల్, మెడిసిన్, ఆస్పత్రి వెళ్లే వారికే మాత్రమే అనుమతి ఇస్తామని తెలియజేశారు. టైమ్ పాస్ కోసం పాసులు జేబులో పెట్టుకొని తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -