Monday, December 23, 2024

ఫిట్‌నెస్ లేకుండా ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే కఠిన చర్యలు: ఎఎస్‌పి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నామని తిరుమల ఎఎస్‌పి ముని రామయ్య తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులో టెంపో వాహనం బోల్తా పడిన సందర్భంగా ముని రామయ్య మీడియాతో మాట్లాడారు. టెంపో వాహనాలకు ఫిట్‌నెస్, డ్రైవర్లకు అవగాహన లేకే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. తిరుమలకు వచ్చే సొంత వాహనాల డ్రైవర్లకు అవగాహనలేదన్నారు. ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిపి ఫొటోలు దిగడం మంచిది కాదని సూచించారు. ఫిట్‌నెస్ లేకుండా ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దూరప్రాంత వాహనదారులు విశ్రాంతి తీసుకొని ప్రయాణించాలని సూచించారు. వాహనాల ఫిట్‌నెస్‌లపై అలిపిరి వద్ద ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుందన్నారు.

Also Read: కర్నాటకలో లక్షల్లో అక్రమ తెల్లరేషన్ కార్డులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News