Sunday, January 19, 2025

పకడ్బందీ చర్యలతో ప్రలోభాల కట్టడి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ప్రదర్శన చేయరాదు
పోలింగ్ ముగిసిన అరగంట తరువాత వరకు ఎగ్జిట్‌పోల్స్ నిషేధం
పత్రిక ప్రకటనలు అనుమతి తీసుకోని ప్రచురించాలి: సిఇవో వికాస్‌రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రచారం నిషిద్ధమని పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిపోల్స్ నిషేధమని వివరించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం నిషేదించినట్లు అనుమతి పొందిన ప్రకటనలకు పత్రికలో ప్రచురణకు అవకాశముంటుందని స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని చెప్పారు.
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.48 లక్షల మంది ఓటు వేశారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో జన సంచారం ఎక్కువ ఉంటుందని అక్కడ బయట కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 3,803 సెక్టార్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సామాగ్రి ప్రదర్శన చేయరాదని, ఓటర్లను ప్రభావితం చేసే వాటిని మీడియాలో చూపరాదని కోరారు. ఒపీనియన్ పోల్స్ ప్రకటించరాదని ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని పేర్కొన్నారు. అదే విధంగా బల్క్ ఎస్‌ఎంఎస్, వాయిస్ ఎస్‌ఎంఎస్‌లను పంపరాదని సూచించారు. రాష్ట్రంలో స్థానికేతల ఓటర్లు ఉండరాదని వారు వెంటనే స్వంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పారు. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించడానికి పార్టీలు, అభ్యర్థులు రవాణా సదుపాయం ఏర్పాటు చేయకూడదన్నారు. ప్రలోభాలు అరికట్టేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థికి ఒకటి, ఏజెంట్‌కు ఒకటి, కార్యకర్తలకు ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ తర్వాత అవసరమైతే అభ్యర్థుల అనుచరులు ఈవీఎం వాహనాలను ఫాలో చేయవచ్చని పేర్కొన్నారు. ఏజెంట్లు ఉదయం 5.30గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గచ్చిబౌలి స్టేడియంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం నడుస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News