Saturday, December 21, 2024

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : జిల్లాలో మాదకద్రవ్యాలు వాడకుండా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ్ల కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని వీసి సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలను ఎన్‌సిఓఆర్‌డి జిల్లా స్థాయి నార్కో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఎస్పి మనోహర్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గుర్తించిన డ్రగ్స్ అడిక్షన్ కేసుల వివరాలను ఆరా తీశారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి సరఫరా కోసం వినియోగించే ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీని కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకాలజిస్ట్ సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి సిగరెట్లు, 21 వయస్సులోపు వారికి మద్యం విక్రయించడానికి వీలు లేదని, జిల్లాలో ఉన్న మద్యం షాపులు, పాన్ డబ్బాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా పెంచాలన్నారు. ఆర్టిసి నిర్వహించే కార్గో ద్వారా ఎగుమతులు దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్ల విద్యార్థుల అలవాట్లను పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న మెడికల్ షాపులలో హెచ్ డ్రగ్స్ అమ్మకాలు డిజిటల్ విధానం ద్వారా మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం జువెనైల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన పకడ్భందీ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గంజాయి సరఫరా చేసే ఎవరిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి సాగు చేసే వారిని గుర్తించి అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామాల్లో సర్పంచులు, పంచాయతి కార్యదర్శుల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల వ్యసనం ఉన్న వారిని గుర్తించాలని సూచించారు. మాదక ద్రవ్యాలైన గంజాయి వాడేవారు ప్రతి గ్రామంలో ఉన్నారని, వారి ద్వారా సరఫరా చేసే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని, ఎక్సైజ్, పోలీస్ శాఖలు ప్రణాళికబద్ధంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో వ్యత్యాసంగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించి దానికి గల కారణాలను వివరించాలని, మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు తెలిస్తే సంబంధిత తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతి నెల శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించాలని, నిర్వహించే సమావేశానికి సంబంధించిన 15 శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.

సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా క్రైమ్ డిఎస్పి సత్యనారాయణ, డిఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్, డిపిఓ కృష్ణ, డిఈఓ గోవిందరాజులు, నాగర్‌కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్, కల్వకుర్తి డిఎస్పి నరసింహ, అచ్చంపేట డిఎస్పి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఆర్టిసి ఆర్‌ఎంఓ చందు నాయక్, నాగర్‌కర్నూల్ డిఎంఓ, పోలీస్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News