Monday, December 23, 2024

ఈవీఎం, వివి ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ హరీష్

రంగారెడ్డి: ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే ఈవీఎం వివి ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని రాజేంద్రనగర్ ఈవీఎం గోడౌన్స్‌ను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం, వివి ప్యాట్ల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు.

జులై 1వ తేది వరకు పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల పనితీరు పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈవీఎంల బ్యాటరీలను మార్చి వాటిని సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈవీఎంలు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News