Friday, November 15, 2024

అంతర్జాతీయ సరిహద్దుల్లా హస్తిన శివార్లు

- Advertisement -
- Advertisement -

Strict measures to prevent Farmers from leaving Movement site

 

న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలోని రైతు నిరసన స్థలి ప్రాంతాలు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దుల రీతిలో ఉన్నాయి. దేశ రాజధానికి దరిదాపుల్లోనే దేశం వెలుపలి సరిహద్దుల స్థితి కన్పిస్తోంది. అసాధారణ స్థాయిలో ఢిల్లీ ప్రవేశ మార్గాలన్నింటి వద్దా బారికేడ్లు వెలిశాయి. వీటిని దాటి పురుగైన వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఘాజీపూర్ ఇది ఢిల్లీ యుపి సరిహద్దు, ఇక సింఘు ఇది ఢిల్లీ హర్యానా పొలిమేర, ఇక టిక్రి ఇది ఢిల్లీ హర్యానా హద్దు, ఈ మూడు చోట్లా ఇప్పుడు పోలీసు భద్రతా వలయాలు కట్టుదిట్టం చేశారు. ఏకంగా అధికారులు రంగంలోకి దిగి దగ్గరుండి తాత్కాలిక కాంక్రిట్ గోడలు నిర్మింపచేస్తున్నారు. పలు ప్రాంతాలలో రోడ్లపై భారీ స్థాయిలో లోహపు మేకులతో కూడిన పలకలను అమర్చారు. వాహనాలు రాకుండా ఈ ఏర్పాటు జరిగింది. వలయాలుగా ఉండే వైర్ ఫెన్సింగ్ అమర్చారు. శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అవసరం అయినట్లు అధికారులు సమర్థించుకున్నారు.

ఎర్రకోట ఘటనల తరువాతి క్రమంలో ఇప్పుడు శివారు ప్రాంతం అందులోనూ రైతుల నిరసనల స్థలి ప్రాంతాలు కంచుకోటలుగా మారుతున్నాయి. రైతుల ఉద్యమ స్థలి నుంచి ఎవరూ బయటకు రాకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధానంగా సింఘు సరిహద్దుల వద్ద వెలిసిన సిమెంట్ దిమ్మెలకు , బారికేడ్లకు మధ్య షిప్పింగ్ కంటైనర్లు, ఇనుపదిమ్మెలు వెలిశాయి. ప్రవేశద్వారాల వద్ద ఇనుప ముళ్ల కంచెలు వెలిశాయి. ఇప్పుడు ఈ ప్రాంతం పాకిస్థాన్ దగ్గరి సరిహద్దుగా ఉందని, తాము పాకిస్థాన్ నుంచి వచ్చిన వారుగా భావించుకుని ఈ అడ్డు గోడలు కట్టినట్లుగా భావించుకోవల్సి వస్తోందని ,ఓ వైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధం అంటోందని, మరో వైపు వారే తమను అన్ని విధాలుగా వారితో లింక్‌లేకుండా వెలి వేస్తున్నారని, ఇదేం న్యాయం అని రైతు నేత కుల్వంత్ సింగ్ సంధూ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News