Thursday, January 23, 2025

నీరజ్ పన్వార్ హంతకులకు కఠిన శిక్షలు

- Advertisement -
- Advertisement -

Strict punishments for Neeraj Panwar murderers:Minister Panwar

మన తెలంగాణ/ హైదరాబాద్ : నేరానికి పాల్పడేవారిని ప్రభుత్వం వదలిపెట్టే ప్రసక్తే లేదని, ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇటీవల బేగంబజార్‌లో దారుణ హత్యకు గురైన నీరజ్ పన్వార్ భార్య సంజన, తల్లి నిషా పన్వార్‌లు సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో ఆయన కళిశారు. ఈ సందర్భంగా నీరజ్ హత్యకు కారకులతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని వారు మంత్రిని కోరారు. నీరజ్ హత్యకు కారకులైన వారు ఎవరైనా ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇలాంటి సంఘనటలను ఎట్టి పరిస్థితులో ఉపేక్షించబోదని చెప్పారు. నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి తలసాని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైనిక్ క్షత్రియ్ సంఘ్ అధ్యక్షులు రాంపాల్ దౌడ, జగదీష్ ప్రసాద్ పన్వార్‌లు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News