మధ్యప్రదేశ్ సంపన్నుల జ్యూస్‌రూట్
భోపాల్ : ప్రపంచంలోనే అతి అరుదుగా లభించే మియాజకి మామిడిపండ్ల చెట్లను మధ్యప్రదేశ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పరిరక్షిస్తున్నారు. జపాన్‌లోనే ఉండే ఈ మామిడి ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్ల రకం. పండ్ల మొక్కల పెంపకాల్లో ఆసక్తి గల జబల్పూరుకు చెందిన దంపతులు రాణి, సంకల్ప్ పరిహార్‌లు కొన్ని ఏళ్ల క్రితం మామిడి మొక్కలను నాటారు, అయితే ఇవి రూబీ రంగు మామిడిపండ్లను కాశాయి. అప్పటికీ కానీ వారికి ఇవి అత్యంత విలువైన అరుదైన జపాన్ రకం పండ్ల మామిడి అని తెలిసిరాలేదు. తరువాత వెంటనే వీరు ఈ ఏడు చెట్లకు కాపలా ఉండేందుకు నలుగురు గార్డులను, ఆరు శిక్షణ పొందిన శునకాలను పెట్టారు. బిలియనీరు అయిన పరిహార్‌కు మొక్కల పెంపకం ఓ హాబీ. అయితే పనిలో పనిగా వాటిని వాణిజ్యపరంగా కూడా వినియోగించుకోవాలని ఏకంగా ఈ మామిడి పండ్ల జ్యూస్ తీసే పరిశ్రమను పెట్టాలని కూడా సంకల్పించారు. ఈ మామిడి పండ్లను సూర్యుడి గుడ్లు అని పిలుస్తారు. వీటి కిలోధర అంతర్జాతీయ మార్కెట్‌లో గత ఏడాది రెండున్నర లక్షలకు పైగా పలికింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆసక్తి గల దంపతులు తాము జపాన్ నుంచి తెచ్చిన చెట్లను విస్తరింపచేసుకుంటూ ఈ పండ్ల వ్యాపారంలో మరింతగా రాణించి ధనవంతుల దిశలో పండిపోవాలని పథకాలు సిద్ధం చేసుకున్నారు.