మన తెలంగాణ/మోత్కూరు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. కేరళలో జరగనున్న సిపిఎం 23వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం మోత్కూరులో ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారని, దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందన్నారు. కార్మిక చట్టాల రద్దుతో కార్మికులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నారు. జాతీయ మహాసభల్లో ధరల భారంపై, ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాలు రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, నాయకులు కందుకూరి నర్సింహ, చామకూరి శోభ, సావిత్రమ్మ, గుండు లక్ష్మీనర్సమ్మ, వెంకటమ్మ, నరేష్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -