Tuesday, April 8, 2025

జల వివాదాలపై గట్టి వాదనలు

- Advertisement -
- Advertisement -

అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో సాగాలి ఈ నెల 15,16
తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనల నేపథ్యంలో ఆయా
బృందాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిశానిర్దేశం

లాయర్ల బృందానికి సంపూర్ణ సహకారం

మన తెలంగాణ / హైదరాబాద్: కృష్ణా నదీజలాశయాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కృష్ణా ట్రిబ్యునల్ –2 ముందు తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నీటిపారుదల శాఖ కార్యాలయం జలసౌధలో నీటిపారుదల ఉన్నతాధికారులు, న్యాయవాదుల ప్రతినిధుల బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షసమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్(ఇఎన్‌సి)లు అనిల్ కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్య నాథన్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు.
ఈనెల 15,16న వాదనలు
ఇప్పటి వరకు కృష్ణా ట్రిబ్యునల్ -2 ఎదుట జరిగిన వాదనలను వారు సమీక్షించారు. తిరిగి ఈనెల ఏప్రిల్ 15,16 తేదీలలో ట్రిబ్యునల్ ముందు జరిగే వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రస్తావించాల్సిన అంశాలను సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహాన్ని ఈ సమావేశంలో రూపొందించుకున్నారు.
నీటివాటాలపై గట్టిపట్టు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తదుపరి కృష్ణా నదీ జలాల విషయంలో ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులు వంటి అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు, న్యాయవాదులకు వివరించారు. రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన కృష్ణా నదీ నీటి కేటాయింపులపై బలమైన వాదనలు వినిపించేందుకు మంత్రి వారికి మార్గనిర్దేశం చేశారు.
రైతుకు నీటి కొరత రానీయం
దశాబ్దాలుగా సాగునీటి మీద ఆధారపడి సేద్యం చేస్తున్న రైతాంగం నీటి కొరతతో ఆందోళనకు గురవుతున్నారని, ఏపి సర్కారు చేస్తున్న అన్యాయలను ఎదురించి న్యాయమైన హక్కులను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.
సమన్వయంతో సాగాలి
కృష్ణా ట్రిబ్యునల్ -2 ముందు వాదనల సమయంలో కావాల్సిన సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు ఢిల్లీలో ఉన్న లీగల్ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయ్యాలని మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ న్యాయ స్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసులు, అప్పీల్స్ వాటి ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు అందుబాటులో ఉంచాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News