- Advertisement -
ఉలాన్‌బాతర్: మంగోలియాలో మంగళవారం ఉదయం 5.33 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 6.8 భూకంప తీవ్రత ఉందని భూపరిశోధన శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి కంపించిన ప్రాంతంలో ఖోవాస్ గోల్ అనే చెరువు ఉంది. భూకంప కేంద్రం రష్యా సరహద్దు నుంచి 34 కిలో మీటర్ల దూరంలో ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా ఉంటుందని యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భూమికి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి వివరాలు తెలియలేదు. భూకంపం ప్రాంతంలో 5000 మంది ప్రజలు నివసిస్తున్నారు. గత 1950లో రిక్టర్ స్కేలు 6.9 తీవ్రత, 1991లో 6.4 తీవ్రతతో భూకంపాలు సంభవించినట్టు సమాచారం.
- Advertisement -