Tuesday, January 14, 2025

జపాన్‌లో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

- Advertisement -
- Advertisement -

జపాన్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్టు దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. క్యుషు ద్వీపం లోని మియాజాకి ప్రాంతంలో 30 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది.న ఈ క్రమం లోనే మియాజాకితోపాటు కొచీ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. భూకంపం సంభవించిన 30 నిమిషాల్లోనే ఒక మీటరు ఎత్తైన సునామీ అలలు తీరాన్ని తాకినట్టు స్థానిక మీడియా తెలియజేసింది. నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని తీర ప్రాంతాల్లోని నివాసితులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

మియాజాకి స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. క్యుషులో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు లోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9 ,7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యుషు, షికోకులను కుదిపేశాయి. అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News