Friday, November 15, 2024

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పటిష్ట చర్యలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌లు అత్యుత్తమ సేవలు అందించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన అధికారుల బదిలీల్లో టీఎస్ పుడ్స్ ఎండిగా బదిలీపై వెళ్లుతున్న జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్‌లకు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా రెండున్నర ఏళ్లలో జిల్లా సర్వతోముఖాభివృద్ధిగా కృషి చేశారన్నారు.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, పకడ్బందీగా ఆర్‌అండ్‌ఆర్ సమస్యలు పరిష్కారంలో కలెక్టర్ కృషి నాయకత్వం ఉన్నాయని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంలో కలెక్టర్ కృషి చేశారని అన్నారు. ప్రజలలో సైతం మంచి పేరు సాధించుకోవడంలో కలెక్టర్ సఫలీకృతులయ్యారని, జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో విశిష్ట కృసి చేశారని మంత్రి అన్నారు.

జిల్లాలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్నేహపూర్వక వాతావరణంలో మంచి బృందంగా ఏర్పడి ప్రజల సమస్యలు పరిష్కారంలో చిత్తశుద్దితో పని చేశారని, ఒకేసారి కలెక్టర్, అదనపు కలెక్టర్లు బదిలీ కావడం జిల్లాకు లోటు ఏర్పడుతుందన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రభుత్వం మనకు కల్పించిందని, జిల్లాలో ఏర్పడే ప్రతి సమస్యకు మొదటిగా కలెక్టర్‌కు సీఎం వద్ద నుంచి ఫోన్ కాల్ వస్తాయని, జిల్లాకు తల్లితండ్రిగా ఉండాల్సిన బాధ్యత కలెక్టర్‌కు ఉంటుందని, ఆ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ప్రజలకు సేవా దృక్పథంతో పని చేయాలని మంత్రి తెలిపారు.

జిల్లాలో పని చేసే అధికారులు ప్రభుత్వ సిబ్బంది సైతం ప్రజలకు మేలు చేసే దిశగా అందుబాటులో ఉన్న చట్టాలను వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు. టీఎస్ పుడ్స్ ఎండిగా సైలం కలెక్టర్ సంగీత సత్యనారాయణ తన ప్రతిభను చూపించి అక్కడి సవాళ్లను అధిగమసిఊ్త మంచి పాలన అందించాలని, సంగీత సత్యనారాయణ ప్రారంభించిన మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూ, అవసరమైన మేరకు నూతన కార్యక్రమాలను సైతం ప్రారంబిస్తూ పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేసే బాధ్యతను నూతన జిల్లా కలెక్టర్ సమర్థవంతంగా నిర్వహించాలని ఆశిస్తున్నానని, జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు.

జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్ చేసిన కృషి ఫలితంగా చాలా రంగాలలో పెద్దపల్లి మంచి ఫలితాలు సాధించిందని, భవిష్యత్‌లో సైతం వారు ప్రజలకు మరింత సేవ చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మంథని సింగరేణి ప్రభావిత గ్రామాలలో గత 15 ఏళ్లు పెండింగ్‌లో ఉన్న సమస్యలను అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ మార్గదర్శకాలను వినియోగించి సమస్యలు పరిష్కరించారని, దానికి మంథని ప్రజలు తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యలు పరిష్కారానికి కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని ఓపికతో కలుస్తూ చిరునవ్వుతో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సమస్యలు తెలుసుకొని వారికి భరోసా కల్పించారని తెలిపారు. అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ జిల్లాలో అద్భుత ప్రగతి సాధించారని, గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల అభివృద్ధి, పట్టణాలలో కల్పిస్తున్న మౌళిక సదుపాయాలలో స్థానిక సంస్థలు కలెక్టర్ కుమార్ దీపక్ తన మార్క్ చూపించారని అన్నారు.

సర్పంచ్‌లు, ప్రభుత్వ అధికారులు సమన్వయం చేస్తూ నూతన గ్రామపంచాయతీ చట్టం కట్టుదిట్టంగా అమలు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. జిల్లా నూతన కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ సిద్దిపేటలో పని చేసి వచ్చారని, ఆయన తండ్రి ఏకే ఖాన్ హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా ఉన్నత సేవలు అందించారని, వారి సారథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత రెండున్నర ఏళ్లుగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హునికి అందేలా అద్భుతంగా కృషి చేశారని అన్నారు. జిల్లాలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కోసం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులైన పేదలకు పట్టాలను పంపిణీ చేశారని అన్నారు. ధరణి సమస్యల పరిష్కారంలో కూడా ప్రత్యేక చొరవ చూపించారన్నారు.

ధరణి భూ సమస్యల పరిష్కారానికి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ చిత్తశుద్దితో కృషి చేశారని, జిల్లాలో వేల సంఖ్యలో ధరణి సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ పకడ్బందీగా నిర్వహించారని, ప్రభుత్వ విధానంలో భాగంగా జిల్లాలోని వ్యవసాయ క్లస్టర్లోల రైతు వేదికల నిర్మాణ పనులు, ప్రతి గ్రామంలో స్మశాన వాటిక డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేశారన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్ట ర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్‌లకు జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News