Monday, December 23, 2024

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి సంఘ టనలు జరగకుండా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పి తెలిపారు.

జిల్లా కేంద్రంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షకు 34 పరీక్ష కేంద్రాల్లో 12,127 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడం జరుగుతుందని , సుదూర ప్రాంతాల నుండి పరీక్ష రాసేందుకు నగరానికి వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సరయైన సమయంలో చేరుకొనేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రూప్ 1 పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News