న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో, దాని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ భూప్రకంపనలు తీవ్రంగానే ఉండినాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం(ఎన్‌సిఎస్) ప్రకారం భూకంప కేంద్రం నేపాల్‌లో నమోదయింది. నేడు మధ్యాహ్నం 2.28 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదయింది. 20 రోజుల తర్వాత రెండోసారి భూప్రకంపన చోటుచేసుకుంది. దీనికి ముందు జనవరి 5న అఫ్ఘానిస్థాన్‌లోని హిందూ కుశ్ క్షేత్రంలో 5.8 తీవ్రతతో భూకంపం నమోదయింది.
నోయిడాలో ఒక పెద్ద భవనంలో నివసించే శాంతను ‘భూకంపంతో భయం వ్యాపించింది’ అన్నారు. ఢిల్లీలో చాలా మంది భూకంపానికి భయకంపితులయ్యారు. ఇప్పటి వరకైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టంకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదు. ఈ కొత్త సంవత్సరం జనవరిలో ఇప్పటి వరకు మూడు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్‌సిఎస్) ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్లేలు మీద 3.8గా నమోదయింది. దేశంలో వచ్చే భకంప స్థితిగతులను ఎస్‌సిఎస్ గమనిస్తుంటుంది. రాత్రి 1.19.42 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్ తెలిపింది. ఈ భూకంప కేంద్రం హరియాణకు చెందిన ఝజ్జర్‌కు 12 కిమీ. దూరంలో నమోదయింది. ఇది భూమిలో 5 కిమీ. లోతు వరకు ఉండింది.
Strong earthquake tremors felt in Delhi pic.twitter.com/VZkRU4uyLy
— ANI (@ANI) January 24, 2023