Thursday, December 26, 2024

గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Strongly condemns Governor's comments: Minister Harish

హైదరాబాద్: రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రరెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్ పీ ఛైర్మెన్ సునీతా మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.  వికారాబాద్ జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నదని మంత్రి పేర్కొన్నారు. మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు అని నేను ఉద్యమం సమయంలో అడిగాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు జిల్లాలుగా మారి, డిగ్రీ కాలేజీలు కాదు మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది.

మొన్ననే సీఎం కేసీఆర్ రూ. 235 కోట్లతో వికారాబాద్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో 30 కోట్లతో నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తాము. రూ.15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి వికారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గవర్నర్ వైద్యుల మనో దైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో వైద్యం బాగోలేదని ఎలా అంటారు. తీవ్రంగా ఖండిస్తున్నామని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించింది. ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే, మీరు విమర్శలు చేస్తారు. మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతున్న విషయాన్ని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనూ ఇంత పురోగతి లేదు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్, ఇతర చర్యల వల్ల 2014 లో 30 శాతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 66 శాతం చేరాయన్నారు.

హెల్త్ అండ్ వెల్నెస్ ర్యాంకింగ్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మలేరియా నివారణలో 2 నుండి కేటగిరీ 1 కి రాష్ట్రం అభివృద్ధి చెందింది అని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడం వల్ల, ఆశాలు ఏఎన్ఎంలు మా వైద్యాధికారులు ఎంతో కృషి చేయడం వల్ల సాధ్యమైంది. ఇది గవర్నర్ కి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఒక డాక్టర్ గా మీరు తెల్సుకుని మాట్లాడాలి. గవర్నర్ గారు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిని ఒక్కసారి వెళ్లి చూడండి. ఇదే సమయంలో మా తెలంగాణ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు చూడండి. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా ఏమ్స్ లో లేవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైంది. పేషెంట్లు లేరు డెలివరీలు కావు. కనీస సౌకర్యాలు ఉండవని మంత్రి హరీశ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News