Thursday, January 23, 2025

కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ల కోసం పోరాటం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గిరిజన సంఘం

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మానాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ ఠాను నాయక్ స్ఫూర్తితో 20న జరిగే గిరిజన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫలుక్ నామ, రవీందర్ నాయక్ నగర్ లో 20న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని గోడ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎం. ధర్మనాయక్. మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధాలను అవలంబిస్తున్నదని దానికి వ్యతిరేకంగా కామ్రేడ్ తాను నాయక్ స్ఫూర్తితో పోరాటానికి రావాలని గిరిజనులకు పిలుపునిచ్చారు ‘మార్చి 20వ తేదీన’  ఠాను నాయక్ వర్ధంతి సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

చేసిన పోరాట స్ఫూర్తితో తమ హక్కుల సాధన కోసం మరో పోరాటం చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని, కారు చౌకగా అమ్మేస్తున్నదని ఆరోపించారు. మరోసారి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో వస్తే గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వారన్నారు. దేశంలో గిరిజనుల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశా౪రు. అనేక గిరిజన తెగలు ఇప్పటికీ షెడ్యూల్ తెగలుగా గుర్తించబడలేదని వాటికోసం గిరిజనులు అనేక ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భాష అనేక తెగల్లో తమ భాషను మాట్లాడుకుంటున్నారని భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని అందుకోసం గిరిజనులు మాట్లాడే భాషకు లిపి కనుగొని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి విద్యా బోధించి భాషను రక్షించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News