Sunday, January 12, 2025

దీక్ష ఆరంభమే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :‘ఈ దీక్ష ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకూ తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగిసింది. దీక్షను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రా రంభించగా, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర, సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డా.కె.నారాయణ, లోక్‌సభలో బిఆర్‌ఎస్ పక్ష నా యకులు నామా నాగేశ్వర్‌రావులతో కలిసి ఎంపి కేశవరావు నిమ్మరసం ఇచ్చి కవితతో దీక్షను విరమింపజేశారు. ఒక్కరోజు దీక్షకు విపక్షాలు బాసటగా నిలిచాయి.

ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని, ఇది ఒక్క రా ష్ట్రానికి సంబంధించిన సమస్య కాదనీ ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తమ పో రాటం కొనసాగుతోందన్నారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదన్నారు. మోడీ సర్కార్ తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుందని, డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ము గిసే వరకూ పోరాడుతూనే ఉంటామని ఆమె హె చ్చరించారు. రాష్ట్రపతికి కూడా తాము విజ్ఞప్తి చే స్తున్నామన్నారు. ఈ ఇంకా ఉధృతమవుతుందని, ప్రస్తుతం ఢిల్లీ గడ్డ మీద చేపట్టిన ధర్మ దిగ్విజయంగా సాగిందన్నారు.

బిల్లు పెడితే అన్ని పార్టీల మద్దతు

బిజెపి బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయని కవిత పేర్కొన్నారు. భారత సంస్కృతిలో మహిళ కు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటా రు. అందులో అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ కవిత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీ మహిళా నేతలు, విద్యార్థి నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎంఎల్‌సి కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఈ దీక్షకు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయని, ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మహిళా నేతలకు, విద్యార్థి నేతలకు కవిత ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. కవిత దీక్షలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, చిత్ర సర్వార, నరేశ్ గుజ్రాల్ (అకాలీదళ్) శివసేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పిడిపి), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టిఎంసి), కేసీ త్యాగి (జేడియూ), సీమా మాలిక్ (ఎన్‌సిపి), కె.నారాయణ (సిపిఐ), సీతారాం ఏచూరి (సిపిఎం), పూజ శుక్లా (ఎస్‌పి), శ్యామ్ రాజక్ (ఆర్‌ఎల్‌డి), కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ బిల్లుకు మోడీ మద్ధతు తెలిపారు: సీతారాం ఏచూరి

మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, ఈ బిల్లును ప్రవేశపెడితే ఆమోదం పొందేవరకూ తాము వెన్నంటి ఉంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హామీ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిగా ఉన్న సమయంలో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిం దని ఏచూరి గుర్తుచేశారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కవిత ఒక మంచి అడుగు వేశారని ఆయన పేర్కొన్నారు.

ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని, కానీ లోక్‌సభ ఆమోదముద్ర వేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోడీ కూడా మద్దతు తెలిపారని సీతారాం ఏచూరి గుర్తుచేశారు. మోడీ ప్రధానమంత్రి అయి తొమ్మిదేళ్ల్లు పూర్తయినా ఇప్పటివరకు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని పట్టుబడుతామని ఆయన పేర్కొన్నారు.

మహిళా కోసం పోరాడటం శోచనీయం: మంత్రి సత్యవతి

సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు వంటిల్లు దాటకుండా చూడాలన్న భావన సరైంది కాదని ఆమె విమర్శించారు. ఈ బిల్లుపై బిజెపికి అవకాశం ఇచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా బిజెపి కళ్లు తెరవాలని ఆమె సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పదవులు కాపాడుకోవడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని ఆమె స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని ఆమె వెల్లడించారు. పార్లమెంటులో మెజార్టీ ఉన్నా మోడీ ప్రభుత్వం మహిళా బిల్లు పెట్టకపోవడం సిగ్గుచేటని మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News