Monday, January 20, 2025

బోన్ క్యాన్సర్‌తో పోరాటం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఇల్లంతకుంట : అభం శుభం తెలియని ఆ చిన్నారి పసిపాపకు పెద్ద కష్టం వచ్చింది. తనకు ఏం జరుగుతుందో అని కూడా తెలియని ఆపాపకు పెద్ద వ్యాధి సోకింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన కర్ల తిరుపతి కూతురు కర్ల సాత్విక(11) బోన్ క్యాన్సర్ తో భాదపడుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో మహామ్మారి వ్యాధి చీకటిని మిగిల్చింది. సాత్విక ప్రస్తుతం గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురవుతుంది. దీంతో కరీంగనర్, హైద్రబాద్, వరంగల్ ఆస్పత్రికి వెళ్లి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వైధ్యం చేయిస్తువస్తున్నారు.

Also read: ‘ఏజెంట్’ నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా పరిచయం

కానీ పూర్తి స్థాయిలో సాత్విక కోలుకోవాలంటే ఆపరేషన్ చేయాలని వైధ్యులు తెల్చిచెప్పారు. వైధ్య ఖర్చుల కోసం ఆపన్న హస్తం అందించాలని వేడుకుంటున్నారు. రూ.8లక్షల వరకు ఖర్చు అవుతుందని, వైధ్య సహాయం చేసి తన కూతురు ను కాపాడాలని తల్లిదండ్రులు ప్రాధేయ పడుతున్నారు. దాతలు పంపిచాల్సిన ఫోన్ నెంబర్ , గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ లు :9059243891, 9490548827.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News