న్యూఢిల్లీ: ఫిబ్రవరి 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖలీద్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ (UAH) సభ్యుడు ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు శనివారం విడుదల చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి పులస్త్య ప్రమాచల నిర్దోషిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉమర్ ఖలీద్ , ఖలీద్ సైఫీపై ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో 2020లో కేసు నమోదైంది. అక్టోబర్ 18న ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
మార్చి 24న నగరంలోని కర్కర్‌దూమా కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఉమర్ ఖలీద్ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 13, 2020న అరెస్టయ్యాడు, అప్పటి నుంచి కస్టడీలో ఉన్నాడు. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, మరికొంత మందిపై ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) , ఫిబ్రవరి 2020 అల్లర్లకు “సూత్రధారులు” అని ఆరోపిస్తూ భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. నాడు అనేకమంది మరణించారు, 700 మందికి పైగా గాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఆ హింస చెలరేగింది.
ఉమర్ ఖలీద్ విడుదల సామాజిక అశాంతికి దారితీస్తుందని నవంబర్ 25న ఢిల్లీ పోలీసులు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. డిసెంబర్ 28న జరగనున్న తన సోదరి వివాహానికి సంబంధించి ఉమర్ ఖలీద్ రెండు వారాల మధ్యంతర బెయిల్ కోరాడు. ఉమర్ ఖలీద్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులు అడిషనల్ సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ కోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశారు.
Delhi's Karkardooma Court discharges Umar Khalid and Khalid Saifi in a riot-related case in February 2020.
— ANI (@ANI) December 3, 2022