Tuesday, December 24, 2024

నార్సింగిలో డ్రగ్స్ కలకలం..

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ తీసుంటుండగా ఓ విద్యార్థిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎపిలోని కృష్ణా జిల్లా, గన్నవరానికి చెందిన సాకేత్ గుజరాత్ రాష్ట్రంలో చదువుకుంటున్నాడు. తన సేహ్నితులు ఉండడంతో బెంగళూరుకు వచ్చాడు.అక్కడ ఎండిఎంఏ డ్రగ్స్ 5గ్రాములు కొనుగోలు చేసి నగరానికి వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో యువకుడి కోసం వేచి చూస్తున్నారు.

ఈ క్రమంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్‌సిటీ వద్ద డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకున్నారు. విద్యార్థి వద్ద నుంచి 5గ్రాముల ఎండిఎంఏ 14 ఇన్సులిన్ సిరింజిలు, వేయింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యవకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ విక్రయించడానికి తీసుకుని వచ్చాడా, బెంగళూరులో ఎవరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశాడు, ఇక్కడ ఎవరికి విక్రయించేందుకు తీసుకుని వచ్చాడు అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News