ప్రధాన నిందితురాలు ఉత్తరాఖండ్‌లో అరెస్టు
ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బుల్లిబాయ్ యాప్ కేసులో బెంగళూరులో సోమవారం అరెస్టయిన ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్‌కుమార్ (21)ను ముంబై సైబర్ పోలీసులు మంగళవారం బాంద్రా కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 10 వరకు కోర్టు విశాల్‌కుమార్‌ను కస్టడీకి పంపింది. ఈ కేసులో ప్రధాని నిందితురాలు ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళ అని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఆమెను అదుపు లోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ ఒకరికొకరు పరిచయస్తులేనని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితురాలైన మహిళ బుల్లిబాయ్ యాప్‌కు సంబంధించి మూడు ఖాతాలను నిర్వహిస్తోంది. విశాల్‌కు ఖల్సాసుప్రీమాసిస్ట్ పేరుతో ఖాతా ప్రారంభించినట్టు పోలీసులు తెలలిపారు. గత డిసెంబర్ 31 న విశాల్ ఇతర ఖాతాల పేర్లను సిక్కు పేర్లను పోలిల ఉండేలా మార్చినట్టు పేర్కొన్నారు. వీరు కాక మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు చెప్పారు.