Wednesday, January 22, 2025

లెక్కల్లో తక్కువ మార్కులు వేశారని… పంతులును చెట్టుకు కట్టేసి

- Advertisement -
- Advertisement -

Student attack on Teacher over Marks

రాంచీ: స్కూల్లో మ్యాథ్స్ టీచర్ తక్కువ మార్కులు వేశాడని అతడితో పాటు క్లర్క్‌ను కూడా చెట్టుకు కట్టేసి చితకబాదిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఝార్ఖండ్‌లో రాష్ట్రంలో తొమ్మిదో తరగతికి చెందిన ఫలితాలను అకడమిక్ కౌన్సిల్ విడుదల చేసింది. దుమ్కా జిల్లాలోని గోపీకందర ప్రాంతంలో గిరిజిన రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 32 మంది విద్యార్థుల్లో 11 మంది ఫెయిల్ కావడంతో మ్యాథ్స్ టీచరే పాక్టీకల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని తెలుసుకున్న విద్యార్థులు ఆ పంతులుతో పాటు మార్కులు అప్‌లోడ్ చేసిన క్లర్క్‌ను పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఆ ఇద్దరిని అసభ్యపదజాలంతో తిడుతూ వారిపై విద్యార్థులు దాడి చేశారు. అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని స్కూల్ ప్రధానోపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News