Wednesday, January 22, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థికి కత్తిపోట్లు..

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: హాస్టల్ విద్యార్థులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. ఉప్పునుంతలకు చెందిన సాల్వాడి నరేష్, రవితేజ, కార్తీక్ స్థానిక బీసీ హాస్టల్లో చదువుతుండగా.. రాత్రి హాస్టల్లో భోజనం చేసి బైకుపై ఇంటికి బయలుదేరారు.

మార్గమధ్యలో 9వ తరగతి విద్యార్థులైన మందుల రాము, మేడముని చరణ్ వారిని అడ్డగించి కత్తులతో దాడి చేసి పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరేష్ ను చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Also Read: కరీంనగర్‌లో బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News