- Advertisement -
త్రిసూర్: కేరళలోని త్రిసూర్ జిల్లా వడక్కంచెరి ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం నాలుగో తరగతి విద్యార్థి ఆదేశ్(9) విషపూరిత పాము కాటుకు గురయ్యాడు. ఉదయం 10.00 గంటల సమయంలో బాలుడు తన పాఠశాలకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అతడు బస్సు నుంచి దిగిన తర్వాత రక్తపింజరి పాము(వైపర్)కాటుకు గురయ్యాడని తెలిసింది. తన తరగతి గదికి 200 మీటర్ల దూరంలో పాము కాటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వెంటనే చిన్నారిని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
- Advertisement -