Monday, December 23, 2024

యుపి కాలేజీలో బురఖాల షో..

- Advertisement -
- Advertisement -

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో ఓ ముస్లిం విద్యార్థినిలు బురఖాలతోనే ర్యాంప్‌పై కలియ తిరిగింది. ముస్లిం విద్యార్థుల సృజనాత్మకతను చాటేందుకు ఈ షోను నిర్వహించినట్లు ప్రదర్శన జరిగిన శ్రీ రామ్ కాలేజీ నిర్వాహకులు తెలిపారు. ముందుగా అలినా యా అనే అమ్మాయి నల్లటి బురఖాతో సాగారు. తరువాత పలువురు ఆమెను అనుసరించారు. వీరిలో పలు రకాల రంగుల బురఖాలు ధరించి ఉన్నవారు ఉండటంతో

ఇదో సరికొత్త ఫ్యాషన్ ర్యాంప్ షో అయింది. బురఖా అందాన్ని దాచిపెట్టే వస్త్రం కాదు. ఇది కూడా ఫ్యాషన్‌కు ప్రతీక, బురఖాతో ఆత్మవిశ్వాసం చాటుకోవడం ఈ షో ఆలోచన అని విద్యార్థినులు తెలిపారు. అయితే ఈ ప్రదర్శనపై జమాయిత్ ఉ ఉలేమా ఆగ్రహం వ్యక్తం చేసింది. బురఖాను ఫ్యాషన్‌కు ప్రతీకగా చేసుకుని సాగిన ఈ వ్యవహారం పట్ల ఉపేక్షించేది లేదని నిర్వాహకులపై చర్యలు తప్పవని ఈ ముస్లిం సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News