Sunday, April 13, 2025

హాస్టల్ గదిలోకి ట్రాలీ బ్యాగ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ను తరలిస్తూ దొరికిపోయిన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను దొంగచాటుగా ట్రాలీ బ్యాగ్‌లో తన హాస్టల్ గదికి తీసుకెళుతూ దొరికిపోయిన సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ యూనివర్శిటీ అయిన ఓపి. జిందాల్ యూనివర్శిటీలో ఇది జరిగింది. అయితే యూనివర్శిటీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గుట్టు రట్టయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో భద్రతా సిబ్బంది పెద్ద ట్రాలీ బ్యాగ్‌ను తెరువగా అందులో నుంచి ముడుచుకు కూర్చున్న అమ్మాయి బయటికి వచ్చింది. ఈ దృశ్యాన్ని యూనివర్శిటీలోని తోటి విద్యార్థులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఈ సంఘటనపై విశ్వవిద్యాలయం స్పందిస్తూ, ఇది పెద్ద విషయమేమి కాదు…విద్యార్థులు ఇలాంటి తుంటరి పనులు చేస్తుంటారు అని తెలిపింది.‘మా విద్యార్థులు తుంటరి పనులు చేస్తుంటారు. అయినా మా భద్రత గట్టిగా ఉండడంతో ఆ విద్యార్థి దొరికిపోయాడు. ఇది పెద్ద విషయం ఏమి కాదు…మా భద్రత ఎల్లప్పుడూ కఠినంగా ఉంటుంది. కాగా ఈ విషయంపై ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు’ అని ఆ విశ్వవిద్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. కాగా ట్రాలీ బ్యాగ్ నుంచి బయటికి వచ్చిన ఆ అమ్మాయి అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినా, లేక బయటి నుంచి వచ్చిన వ్యక్తా అన్నది తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News