Tuesday, December 24, 2024

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బాసర: ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన బాసర, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మూడు, నాలుగు రోజుల క్రితమే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ (18) ఆర్జీయూకేటీలో పీయూసీ-2 చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్లో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గది నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీ అధికారులకు సమాచారమందించారు. అధికారులు వచ్చి చూడడంతో భానుప్రసాద్ ఆత్మ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

కాగా అతడు మూడు, నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి భానుప్రసాద్ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. భానుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆది వారం మధ్యాహ్నమే తెలిసినా అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News