మల్కాజిగిరి: బడికి వెళ్లడం ఇష్టం లేని ఓ విద్యార్థి తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన కరింగుల విజయ్‌కుమార్ కారు డ్రైవర్. ఇతని పెద్దకుమారుడు కరింగుల అర్జున్‌కుమార్ (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇతడికి బడికి వెళ్లడం, చదువుకోవడం ఇష్టం లేదు.
అయినప్పటికి తల్లిదండ్రులు తమ కుమారుడిని బడికి పంపుతున్నారు. తనను బలవంతంగా బడికి పంపుతున్నారని విరక్తి పెంచుకున్న అర్జున్‌కుమార్ శనివారం ఉదయం తన ఇంట్లో బాత్రూమ్లోని పైప్‌కు టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికి అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.