Sunday, December 22, 2024

నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః నీట్ పరీక్ష భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్ప్రింగ్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న పి. జైస్వాల్(20) నీట్‌కు ప్రిపేర్ అవుతోంది. ఇటీవల కాలంలో పరీక్షపై జైస్వాల్ ఆందోళన చెందుతున్నాడు.

పరీక్ష క్లియర్ చేస్తానో లేదో నని భయపడుతున్నాడు. ఆత్మహత్యకు ముందు యువకుడు సూసైడ్ లెటర్ రాసి పెట్టాడు. దానిలో తాను నీట్ పరీక్షలో నెగ్గనని రాసి పెట్టాడు. ఈ క్రమంలోనే స్ప్రింగ్ కాలనీలోని చంద్రోదయ అపార్ట్‌మెంట్ ఐద ఫ్లోర్ నుంచి ఆదివారం తెల్లవారుజామున కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కిందపడిన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ ఇన్స్‌స్పెక్టర్ కె.విజయవర్దన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News