- Advertisement -
హైదరాబాద్: అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్వడం మంచిది కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలు పెడుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కెసిఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపామన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని పిల్లులు ఆకలికేకలు వినపడుతున్నాయని ధ్వజమెత్తారు. పదేళ్ల కెసిర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించారని కెటిఆర్ ప్రశంసించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు ఉన్నారని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో నేడు గుప్పెడన్నం కోసం గుండెలువిసేలా రోదించడమా బాధను కలిగిస్తుందన్నారు.
- Advertisement -