Thursday, January 23, 2025

విద్యార్థి గొంతు కోసిన మరో విద్యార్థి

- Advertisement -
- Advertisement -

Student cut throat by another student

 

హైదరాబాద్: విద్యార్థి తోటి విద్యార్థి గొంతు కోసిన సంఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతం బాలుర గురుకుల ఐఐటి క్యాంపస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నెల 26న టిఫిన్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. టీచర్ ఇద్దరు విద్యార్థులను పిలిపించి సర్ది చెప్పారు. అదే కక్షతో ఓ విద్యార్థి అర్థరాత్రి సమయంలో మరో విద్యార్థిపై కతితో గొంతు కోశాడు. వెంటనే తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News